“సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ సోదరులపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్రం చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లాఠీ ఛార్జీకి ఎవరు ఆదేశించారు? ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్పా న్యాయం కోరే భక్తులపై కాదు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఇది స్పష్టమైన ఉదాహరణ, మెజారిటీ ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాము” – రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే