వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలను, కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వంటలు వండే వంటశాల, స్థితిగతులను పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌ను ఓపెన్ చేశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు.