శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ్‌ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్‌, సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌. ఈ మూవీ అక్టోబర్‌ 25న రాబోతోంది.  ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్‌ బాబు, దర్శకులు వీరశంకర్‌, వీజే సన్నీ, శ్రీరామ్‌ ఆదిత్య, వితిక షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘శివ, నితిన్‌ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్‌ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. అక్టోబర్‌ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని అన్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ప్యాషన్‌, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్‌ స్టేజ్‌ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్‌ రిలీజ్‌ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను. అక్టోబర్‌ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి టీంను సపోర్ట్‌ చేయండి’ అని అన్నారు. 

 డైరెక్టర్‌ రిషికేశ్వర్‌ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్‌ చేసిన టీజీ విశ్వ ప్రసాద్‌ గారికి థాంక్స్‌. మా ఈవెంట్‌కు వచ్చిన సుదీర్‌ బాబు గారికి, శ్రీరామ్‌ ఆదిత్య గారికి థాంక్స్‌. శివ, నితిన్‌ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్‌ చేసిన మా టెక్నికల్‌ టీంకు థాంక్స్‌. మా చిత్రం అక్టోబర్‌ 25న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత డా. సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రెజెంట్‌ చేస్తున్న విశ్వ ప్రసాద్‌ గారికి థాంక్స్‌. మా మూవీ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సుధీర్‌ బాబు గారికి థాంక్స్‌. రిషికి మంచి టాలెంట్‌ ఉంది. శివ చక్కగా నటించాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీని చూసి కంటెంట్‌ నచ్చి విశ్వ ప్రసాద్‌ గారు ముందుకు వచ్చారు. మేం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. మాకు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్‌ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం. అక్టోబర్‌ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here