సక్సెస్ ఫుల్ కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ లా టాటా పంచ్ ఈవీ ను తీసుకువచ్చారు. కానీ ఇది అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 25 కిలోవాట్ల బ్యాటరీ, 35 కిలోవాట్ల బ్యాటరీతో నడిచే పంచ్ ఈవీ వరుసగా 265 కిలోమీటర్లు, 365 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.