ఉద్యాపనం

అట్లతద్ది రోజున ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని తల స్నానం చేయాలి. ఆరోజంతా ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవిని పూజించి పది అట్లు నైవేద్యము పెట్టాలి. పది అట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట ఒక్కొక్కరికి పదేసి అట్లు, నల్లపూసల కోవ, లక్కజోళ్ళు, రవికలగుడ్డ, దక్షిణ తాంబూలములతో కలిపి పదిమంది ముత్తయిదువులకు వాయనములు ఇవ్వవలెను. కథ లోపమైనా వ్రతలోపము కారాదు. భక్తి తప్పకున్న ఫలము కల్గును అని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here