18 మందికి బస్సు
ప్రతి శనివారం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద పర్యాటక శాఖ ఆఫీసు వద్ద నుంచి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరి కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించి, రాత్రి 7.00 గంటలకు రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్‌కు చేరుకుంటాయి. పర్యాటకులు గోదావరి నది హారతి తిలకించేలా ఏర్పాట్లు చేస్తారు. రాత్రి 7.30 గంటలకు రాజమండ్రి ఇన్‌ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు పర్యాటకులను తీసుకొస్తారు. దీంతో టూర్ పూర్తవుతుంది. 18 మంది సీటింగ్ సామర్థ్యంతో బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు మాసిక ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. సమూహాలుగా భక్తులు సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు.