TS To TG Number Plates : వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని రవాణా శాఖ తెలిపింది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ ను టీజీగా మార్చిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.