బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’కి సీక్వెల్ గా రూపొందనున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman)లో హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తారు అనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. మొదట చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), రానా (Rana) వంటి తెలుగు హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు తెరపైకి వచ్చింది.
‘కాంతార’ సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్. ఆ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అందుకే ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రకు రిషబ్ అయితే బాగుంటాడని భావించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆయనను సంప్రదించగా ఓకే చెప్పాడట. అయితే రిషబ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ పాటు, లాభాల్లో వాటా అడగటంతో ‘హనుమాన్’ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని, దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది.
‘జై హనుమాన్’తో పాటు తెలుగులో మరో సినిమాకి కూడా రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందట. ‘జై హనుమాన్’ కంటే ముందు ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్తుందని వినికిడి.