TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖారు నాటికి నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను గుర్తించనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి విడతగా 3500 నుంచి 4000 ఇళ్లను ఇస్తామన్నారు.