అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ళ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి గురించి మీడియాలో రకరకాల రూమర్స్‌ వచ్చిన తర్వాత ఆగస్ట్‌ 8న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా శోభిత తమ ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటూ కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పెళ్లి ఇంట్లో పసుపు దంచడం ద్వారా పెళ్లి పనులు మొదలు పెడతారు. ఈ కార్యక్రమాన్ని వైజాగ్‌లోని శోభిత నివాసంలో జరిగింది. 

నిశ్చితార్థం జరిగింది గానీ, పెళ్లి డేట్‌ ఇంకా ఫిక్స్‌ అవ్వలేదని అందరూ అనుకున్నారు. అయితే పసుపు దంచే సంప్రదాయ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఆల్రెడీ డేట్స్‌ ఫిక్స్‌ అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. డిసెంబర్‌లో నాగచైతన్య, శోభితల వివాహం జరుగుతుందని తెలుస్తోంది. పెళ్లిపనులు మొదలయ్యాయి కాబట్టి ఇరు కుటుంబాల వారు శుభలేఖలు సిద్ధం చేసే పనుల్లో ఉంటారు. అయితే త్వరలోనే శుభలేఖ పంపిణీని కూడా ప్రారంభిస్తారన్నమాట. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here