‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు సుకుమార్‌ చేసిన అన్ని సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌ తప్పనిసరిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఐటమ్‌ సాంగ్స్‌ అన్నీ ఎంతో పాపులర్‌ అయ్యాయి. అందుకే తన ప్రతి సినిమా ఐటమ్‌ సాంగ్‌ కోసం ఎంతో కేర్‌ తీసుకుంటారు సుకుమార్‌. స్టార్‌ హీరోయిన్స్‌తో కూడా అలాంటి సాంగ్స్‌ చేయించి అందరితో శభాష్‌ అనిపించుకున్నారు. ‘పుష్ప’ చిత్రంలో సమంత చేసిన ఐటమ్‌ సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప2’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. 

రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. అందులో ఐటమ్‌ సాంగ్‌ కూడా బ్యాలెన్స్‌ ఉంది. గత కొంతకాలంగా ఐటమ్‌ సాంగ్‌ ఎవరితో చెయ్యాలా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు సుకుమార్‌. జాన్వీ కపూర్‌, త్రిప్తి డిమ్రి, శ్రద్ధా కపూర్‌ పేర్లు పరిశీలిస్తున్నారని ఆమధ్య వార్త వచ్చింది. అప్పటినుంచి పుష్ప ఐటమ్‌ గర్ల్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఐటమ్‌ సాంగ్‌ కోసం నార్త్‌ అమ్మాయినే సెలెక్ట్‌ చెయ్యాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందులో భాగంగానే యానిమల్‌ చిత్రంలో నటించిన త్రిప్తి డిమ్రి పుష్ప2 కోసం ఐటమ్‌ సాంగ్‌ చేయబోతోందనే వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. ఫైనల్‌గా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 

‘పుష్ప2’ రిలీజ్‌ దగ్గర పడుతున్న కొద్దీ యూనిట్‌లో టెన్షన్‌ పెరుగుతోంది. అందుకే సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు మూడు యూనిట్లు వర్క్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌ మొదలవుతుంది. వచ్చేనెల ప్రథమార్థంలో టోటల్‌గా షూటింగ్‌ పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. పుష్ప చిత్రం కోసం సమంతతో చేసిన ఐటమ్‌ సాంగ్‌ను లాస్ట్‌ మూమెంట్‌లో షూట్‌ చేశారు. ఇప్పుడు పుష్ప2 కోసం కూడా అదే చేస్తున్నారు. ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌తోనే గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ‘పుష్ప2’ బిజినెస్‌ విషయానికి వస్తే రూ.1000 కోట్ల టార్గెట్‌తో సుకుమార్‌ బృందం రంగంలోకి దిగుతోంది. ‘పుష్ప’ రూ.400 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. ‘పుష్ప2’కి ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ చూస్తుంటే రూ.1000 కోట్ల టార్గెట్‌ కష్టమేమీ కాదని ట్రేడ్‌ వర్గాలు కూడా భావిస్తున్నాయి.  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here