ఏపీలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు నేటి(అక్టోబర్ 21) నుంచి ప్రారంభం అయ్యింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండియర్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Home Andhra Pradesh ఏపీ ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజులు చెల్లింపు ప్రారంభం, నవంబర్ 11 చివరి తేదీ-ap intermediate...