సరిహద్దు గ్రామాల్లో
ఏపీ సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ మద్యం షాపుల్లో నిత్యం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు లిక్కర్ విక్రయాలు జరిగేవి. ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రావడం, బ్రాండెడ్ మద్యం దొరుకుతుండడంతో బోర్డర్ సమీపంలోని తెలంగాణ మద్యం షాపుల్లో విక్రయాలు కాస్త తగ్గాయని సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని సత్తుపల్లి, ఆశ్వారావుపేట, భద్రాచలం, మధిర, కోదాడ, హుజుర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో మద్యం విక్రయాలు మందగించాని తెలుస్తోంది. కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గాల్లో సరిహద్దు ప్రాంతంలో 12 మద్యం దుకాణాలు ఉండగా… ఒక్కో షాపులో రోజుకు రూ1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఏపీ మందుబాబు బ్రాండెడ్ మద్యాన్ని విక్రయించేవారు. ఈ లెక్కన అన్ని షాపుల్లో రోజుకు రూ.24 లక్షలు, నెలకు రూ.7 కోట్ల పైగా ఏపీ మందుబాబులు మద్యం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఈ విక్రయాలు తగ్గాయని అక్కడి వ్యాపారులు అంటున్నారు.