అమరులైన కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.1 కోటి 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. శాశ్వత వైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామన్నారు. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో పోలీసులు పాత్ర కీలకమన్నారు. శాంతి భద్రత లేని రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. రాష్ట్రాభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.