బద్వేల్ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని అరెస్ట్ చేసినట్లు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. చనిపోక ముందు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో యువతి దగ్గర వాంగ్మూలం తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని ఆధారాలతో త్వరగా దర్యాప్తు ముగించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేసి, కఠిన శిక్షలు పడేలా చేస్తామని హర్షవర్ధన్ తెలిపారు.