విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు..
గ్రూప్1 పరీక్షల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పరీక్ష గది, చీఫ్ సూపరిం టెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నప క్షేత్రాలు, జవాబు పత్రాలను తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లో ప్రయాణించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.