‘బాహుబలి’తో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకి ఆయనను అభిమానించే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ ను ఇష్టపడే అభిమానుల సంఖ్య మరీ ఎక్కువ. అందుకే ప్రభాస్ సినిమా విడుదలైనా, బర్త్ డే వచ్చినా అక్కడ కూడా తెలుగునాట ఉండే సందడి కనిపిస్తూ ఉంటుంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు జపాన్ లోని టోక్యో రెబెల్ స్టార్ ఫ్యాన్స్. (Prabhas Birthday)

‘రాధే శ్యామ్’ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన అనంతరం హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ బ్యానర్స్ చూపిస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టోక్యో ప్రభాస్ ఫ్యాన్స్. రెబల్ స్టార్ కి టోక్యో ఫ్యాన్స్ చేసిన బర్త్ డే సెలబ్రేషన్ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఇండియాలో కూడా ప్రభాస్ పుట్టినరోజు సందడి మొదలైంది. అటు ఆయన సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్ లు, కొత్త సినిమాల అప్డేట్స్ సిద్ధమవుతున్నాయి. అభిమానులు ఈ స్పెషల్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంతోషంగా సన్నద్ధమవుతున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here