అభ్యర్థులు సీటెట్ అధికారిక వెబ్సైట్ https://ctet.nic.in/ లో లాగిన్ అయ్యి తమ దరఖాస్తులలో మార్పులు చేసుకోవచ్చు. అక్టోబర్ 25 వరకు ఎడిట్ విండో అందుబాటులో ఉంటుందని సీబీఎస్ఈ ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు.. తన పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీలో మార్పులు చేసుకోవచ్చు. వర్గం, వికలాంగుల కేటగిరీ, అలాగే వారు ఎంచుకున్న పేపర్1 లేదా పేపర్ II ను సవరించవచ్చు. అభ్యర్థులు పేపర్ 2, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కోసం ఎంచుకున్న భాష, వారి పోస్టల్ చిరునామా, బీఈడీ డిగ్రీ లేదా డిప్లొమాను పొందిన సంస్థ, కళాశాల లేదా విశ్వవిద్యాలయం పేరును మార్చుకోవచ్చు.
Home Andhra Pradesh సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది-ctet 2024 correction window open candidates...