వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సందీప్ కిషన్(sundeep kishan)ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి  ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన తో సోలో హీరోగా విజయాన్ని అందుకున్న సందీప్ ఇతర బాషా చిత్రాల్లో కూడా ప్రాముఖ్యత ఉన్న క్యారక్టర్ లని పోషిస్తూ బహుముఖ నటుడు అనే గుర్తింపు ని కూడా పొందాడు.ధనుష్ హీరోగా రీసెంట్ గా వచ్చిన రాయన్ మూవీనే అందుకు ఉదాహరణ.

    

సందీప్ కిషన్ వివాహా భోజనంబు(vivaha bhojanambu)అనే పేరుతో హైదరాబాద్ లోని పలు చోట్ల ఫుడ్  రెస్టారెంట్‌ ని నడుపుతున్నాడు. తన బ్రాంచ్ ల నుంచి రోజూకి వందల మందికి ఉచితంగా ఫుడ్‌ను పంపిస్తానని కొన్ని రోజుల క్రితం సందీప్ చెప్పిన  మాటలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి.ఇప్పుడు తాజాగా మరోసారి  తన వివాహా భోజనంబు టీం చేస్తున్న సేవ గురించి ట్వీట్ వేశాడు.ఫుడ్ వ్యాన్ ద్వారా సిటీలోని పలు చోట్ల ఉచితంగా ఫుడ్ ప్యాకెట్‌లను పంచుతున్నాం.మా టీం చేస్తున్న నిర్విరామ కృషికి థాంక్స్. మీకు తెలిసిన వాళ్లు ఆకలితో బాధపడుతుంటే దగ్గర్లో ఉన్న వివాహా భోజనంబుకి వెళ్లి ఫుడ్ ప్యాకెట్లు ని ఉచితంగా తీసుకోమని చెప్పండి.ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి అంటూ  ట్వీట్ వేశాడు.

ఇక ఆ ట్వీట్‌కు బీవీఎస్ రవి(bvs ravi)స్పందించాడు. వివాహా భోజనంబులో మీ హాస్పిటాలిటీ, ఫుడ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి.నువ్వు చేసే సర్విస్ ఇంకా బాగుంది. త్వరలోనే తిరుపతి బ్రాంచ్‌కి వెళ్లాలని అనుకుంటున్నా అన్నాడు.మళ్ళీ వెంటనే థాంక్యూ సో మచ్ అన్నా అంటూ సందీప్  రిప్లై ఇచ్చాడు. త్వరలో మాయా వన్ అనే మూవీతో ప్రేక్షకులని  పలకరించబోతున్న సందీప్ అదే టైంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన(trinadarao nakkina)తో మజాకా(majaka)అనే  ఒక యూత్ ఫుల్ మూవీని చేస్తున్నాడు. సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here