దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటు వినాయకుడు, కుబేరుడిని కూడా పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన దీపాలు, పండ్లు సమర్పిస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. కుటుంబంలో శ్రేయస్సు, సంతోషం నిండిపోతాయి. అమావాస్య రోజు దీపావళి వస్తుంది. చీకటిని తరిమికొడుతూ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ దీపావళి జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.