నర్సీపట్నంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై స్పందించారు. తనకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే భయం, సిగ్గుతోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు. తాను స్పీకర్‌ను కనుక సభ్యులెవరు సభలోకి అడుగుపెట్టినా, సభ నుంచి వెళ్లిపోయినా తనకు నమస్కారం చేస్తారని, అది గౌరవంగా చేయాల్సిందనేనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కూడా నాకు నమస్కారం చేయాల్సి ఉంటుందని అన్నారు.
Home Andhra Pradesh నాకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావటం లేదు- స్పీకర్ అయ్యన్న పాత్రుడు-ap speaker...