ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తెనాలి టు టౌన్ పోలీసులు నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్, సహానాకు చాలా కాలంగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఆమె పని చేస్తున్న చోట కొంత నగదు అప్పుగా తీసుకుని నవీన్‌కు ఇచ్చింది. అతడు సమయం గడిచినా అప్పు తిరిగి ఇవ్వకపోవడం, ఇతర వ్యక్తిగత కారణాలతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నవీన్ కారులో సహానా కొట్టడంతో ఆమె తల డోర్‌కు, డ్యాష్ బోర్డుకు తగిలి తీవ్ర గాయమైంది. తీవ్రమైన తలనొప్పి వస్తుందని యువతి గట్టిగా కేకలు వేయటంతో భయపడిన నవీన్ ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు.
Home Andhra Pradesh ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ-guntur rowdy...