AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా ఉత్తరాంధ్రవైపు దూసుకొస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు శుక్రవారం నాటికి ఒడిశా, బెంగాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్లో తరచూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.