పోలీసులకు పిర్యాదు…కేసు నమోదు
విద్యార్థినులు, ప్రిన్సిపల్ అందరు కలిసి పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ అఖిల్ మహాజన్ రంగంలోకి దిగారు. పోలీస్ టీమ్ ను స్కూల్ కు పంపించి వివరాలు సేకరించారు. విద్యార్థుల ఇచ్చిన సమాచారంతో తెలుగు పండిత్ నరేందర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. విద్యార్థినిలు లేదా మహిళలు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.