వాళ్లెందుకు నష్టపోవాలి
వాళ్లను బాధపెట్టడం తప్పే కానీ, పెళ్లి చేసుకుని తప్పు చేయలేదు. మనం వాళ్లకు చెప్పకుండే చేసుకుంటే వేరు. వాళ్లకు చెప్పాం. వాళ్లు మనల్ని విడదీయాలని అనుకోవడం తప్పు కాదా చెప్పు. అయినా వాళ్ల పంతాలు మన పెళ్లికి అడ్డు రావడం ఏంటీ. ఇలాంటివి రెండు వైపులా తప్పు ఉంటుంది అని శ్రుతి అంటుంది. కానీ, మనవల్ల వదిన ఎందుకు నష్టపోవాలి. వాళ్లు వదినను ఎంత హింసిస్తారో. చేయని తప్పుకు వదినా, నాన్న శిక్ష అనుభవిస్తున్నారు అని రవి అంటాడు.