రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని.. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం.. మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన ఉందని చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.