సంగారెడ్డిలో..
కాలువలోకి స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చలికి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగోలి గ్రామానికి చెందిన కమ్మరి గోపాల్ (20) జహీరాబాద్, పాస్తాపూర్ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోపాల్ కూలీ పనులకు వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగుతూ ఖర్చు చేసేవాడు.