జియోసినిమాలో ‘ఫ్యూరియోసా’

‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (అక్టోబర్ 23) రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమ్ అవనుంది. జూలైలో థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీ మోస్తరు కలెక్షన్లు దక్కాయి. క్రిస్ హేమ్స్‌వర్త్, అన్య టేలర్ జాయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా చిత్రానికి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. జియోసినిమా ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి ఈ మూవీని ఏడు భాషల్లో చూసేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here