జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య కలకలం రేపింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన గంగారెడ్డిని కారుతో ఢీ కొట్టి కత్తులతో పొడిచిన దుండగులు చంపేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. పాత కక్షలే హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే రక్షణ లేదని వాపోయారు.