ఈ ఉద్యోగాలకు 2021-22, 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలోని మేట్, లేదా కూలీగా ఉపాధి హామీ పనికి 25 రోజులు హాజరై ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ పోస్టులను ఎంపికకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ప్రస్తుతం జిల్లాల వారీగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఆ తరువాత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా జల యాజమన్య సంస్థ పథక సంచాలకులకు ఆదేశించింది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Home Andhra Pradesh ఉపాధి హామీ స్కీమ్ లో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, త్వరలో జిల్లాల వారీగా...