భారీగా రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్టు రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటించారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సుమారు 200 సర్వీసులను రద్దు, దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రైళ్లు రద్దు చేశారు. రద్దైన రైళ్ల వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.