ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ స్కీమ్ కు నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన వస్తుంది. ఇంటర్న్ ఫిప్ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 1,25,000 కంటే ఎక్కువ మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు ముందువచ్చాయి. డిసెంబర్ 2 నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రోగ్రామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్న్‌షిప్‌లను అందించే ప్రముఖ కంపెనీలలో లార్సెన్ & టూబ్రో, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐషర్ మోటార్స్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here