పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)బ్లాక్ బస్టర్ మూవీస్ లో జల్సా కూడా ఒకటి. అందులోని సాంగ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి.వాటిల్లోని ఒక పాటలో అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears)గురించి ప్రస్తావనకు వస్తుంది. సినిమా వాళ్లే ఆమె గురించి ప్రస్తావించారంటే బ్రిట్నీ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.తన ఆల్బమ్స్ తో వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది.

కొన్ని రోజుల క్రితం తన మూడో భర్త సామ్ అస్గరి నుంచి విడాకులు తీసుకున్న బ్రిట్నీ  రీసెంట్ గా తన ఇనిస్టాగ్రామ్ లో  ‘నన్ను నేనే పెళ్లి చేసుకున్న రోజు ఇది. ఈ విషయం మీకు చాలా ఇబ్బందిగా, తెలివి తక్కువ పనిగా అనిపించవచ్చు.కానీ నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన పనిగా భావిస్తున్నానంటూ  పోస్ట్ చేసింది. పెళ్లి గౌను ధరించిన ఫోటోలను వీడియోను కూడా షేర్ చెయ్యగా అందులో ఖాళీగా ఉన్న చర్చి తప్పితే బ్రిట్నీ పక్కన ఎవరు లేరు. 

ఒంటరిగా హనీమూన్ కి  టక్సస్ అండ్ కేకస్ కి వచ్చేసా అంటూ మరో పోస్ట్ కూడా చేసింది. టక్సస్ అండ్ కేకస్ అంటే దీవులు.ఇవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి. 

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here