యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యే పలు వీడియోలు ద్వారా విశేష కీర్తిని సంపాదించిన యూ ట్యూబర్ గంగవ్వ.ప్రస్తుతం బిగ్ బాస్ లాంటి ప్రతిష్టాత్మక షో లో కూడా పాల్గొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తుంది.

మే 20 2020 న యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే ప్రోగ్రాం లో  గంగవ్వ చెప్పిన  పంచాంగం వీడియో ఒకటి  అప్ లోడ్ అయ్యింది. ఇంకో యూట్యూబర్ రాజు తో కలిసి గంగవ్వ ఆ వీడియో చేసింది.కాకపోతే అందులో చిలుకని ఉపయోగించి గంగవ్వ పంచాంగం చెప్పింది. దీంతో జ్యోతిష్య ప్రయోజనాల కోసం చిలుకని ఉపయోగించడం వన్య ప్రాణుల రక్షణ చట్టం  ఉల్లగించడం కిందకి వస్తుందని  జగిత్యాల అటవీ శాఖలో జంతు సంరక్షణ కార్యకర్త గా పని చేస్తున్న  అదులాపురం గౌతమ్      పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు గంగవ్వపై కేసు నమోదు చేసారు.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here