భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా గురువారం (అక్టోబరు 24) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా.. మూడు టెస్టుల సిరీస్‌ని దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. దాంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.