పుణె పిచ్ పరిస్థితి ఏంటి?
సాధారణంగా పుణె పిచ్ నుంచి మొదటి రెండు రోజులు తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్లకి సహకారం లభిస్తుంది. కానీ.. ఆ తర్వాత రెండు సెషన్లు బంతి తిరుగుతుంది. అయితే.. మూడో రోజు నుంచి మాత్రం బంతి గింగిరాలు మొదలవుతుంది. ఇక ఐదో రోజుకి వచ్చే సరికి బంతి గమనాన్ని అంచనా వేయడం బ్యాటర్లకి ఛాలెంజ్ అవుతుంది. సరదాగా చెప్పాలంటే.. క్రీజులో బ్యాటర్‌ని స్పిన్నర్లు డ్యాన్స్ వేయిస్తుంటారు.