మెగా డీఎస్సీ 2024 ఉచిత కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్, ఉచిత భోజనం, వ‌స‌తి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రముఖ కోచింగ్ సెంటర్ లలో 3 నెల‌ల పాటు అభ్యర్థులకు తరగతులు నిర్వహించారు. టీచర్ల అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పేపర్‌ 1, 2 ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇస్తారు. మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ కు మొత్తం 5,050 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 3,050 సీట్లు, ఎస్టీలకు 2000 సీట్లు కేటాయిస్తారు. ఎస్‌జీటీ పోస్టులకు కోచింగ్‌ కోసం ఇంటర్, డీఈడీ, టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు డిగ్రీ, బీఈడీ, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్జీటీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.26,500, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.28,500 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here