ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్-2’ ఒకటి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్-1’ 2023 డిసెంబర్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రభాస్ లుక్స్, ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ ని, యాక్షన్ ప్రియులను మెప్పించాయి. అందుకే ‘సలార్-2’ కోసం ఎదురుచూసే వారి సంఖ్య భారీగానే ఉంది. అయితే ప్రభాస్ ‘రాజా సాబ్’, ‘ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏమో ఎన్టీఆర్ తో సినిమా కమిటై ఉండటంతో ఇప్పట్లో ‘సలార్-2’ ఉండదని భావించారంతా. కానీ అనూహ్యంగా ‘సలార్-2’ షురూ అయింది. (Prabhas)

ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ‘సలార్-2’ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. 20 రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. నటి శ్రియా రెడ్డి కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. త్వరలో సలార్-2 సెట్స్ లో కలుద్దామని ట్వీట్ చేయడం విశేషం. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్-2’తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొంటాడు. ఈలోపు  సలార్-2 ని వీలైనంత వరకు షూట్ చేసే ఆలోచనలో నీల్ ఉన్నట్లు తెలుస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here