Sikandar Raza: సికందర్ రజా చరిత్ర తిరగరాశాడు. గాంబియాతో బుధవారం (అక్టోబర్ 23) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అతడు కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ లో భాగంగా గ్రూప్ బి మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. ఇన్నాళ్లూ రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీతో ఈ రికార్డును పంచుకున్నారు.