అప్పట్లో ఆస్తులపై పరస్పర ఒప్పందం
“మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురికీ(మనవళ్లు, మనవరాళ్లకి) సమానంగా పంచాలని ఆదేశించారు. మీరు కూడా ఆ షరతుకి అంగీకరిస్తున్నానని అప్పుడు మాకు హామీ ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటున్నారు. భారతి సిమెంట్స్, సాక్షి, సహా రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురికీ సమానంగా పంచాలని ఆనాడే ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు, మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమించారు.” అని షర్మిల జగన్ లేఖ రాశారు.