ఎక్ట్సీరియర్ ఫీచర్లు
మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిజ్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ). సాధారణ స్విఫ్ట్ ప్రామాణిక ఫీచర్స్ ను నిలుపుకుంటూనే, ఈ ప్రత్యేక ఎడిషన్ అనేక ప్రత్యేకమైన ఎక్స్టీరియర్ అప్ డేట్స్ ను పొందింది. గ్రిల్ గార్నిష్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ముందు, వెనుక, రెండు వైపులా అండర్ బాడీ స్పాయిలర్లు ఇందులో ఉన్నాయి. బాడీ క్లాడింగ్, విండో ఫ్రేమ్ కిట్, డోర్ వైజర్లు, బ్లాక్ రూఫ్ స్పాయిలర్ వంటి అదనపు టచెస్ ఈ ఎడిషన్ ను ప్రామాణిక మోడల్ నుండి మరింత వేరు చేస్తాయి.