ఏపీపీఎస్సీ రేసులో పలువురి అధికారుల పేర్లు వినిపించాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్ పేర్లు వినిపించాయి. కేరళలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో వైస్ చాన్సలర్ పనిచేసిన అప్పారావు, యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టను ఇనుమడింప చేయడం, పరీక్షల నిర్వహణ ఉద్యోగ నియామకాలు వివాదాలకు తావు లేకుండా చేపట్టే క్రమంలో ఏఆర్ అనురాధకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.