బెంగళూరులోని హెన్నూరు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో 5 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్‌లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చారు.