తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అనంతరం రంగ నాయకుల మండపంలో ఆలయ పండితులు మంత్రి సీతక్క ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సీతక్క. పని ఒత్తిడి వల్ల మొక్కు చెల్లించుకోవడం ఆలస్యమైందని చెప్పారు.