వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కేడర్ ను ఏ మాత్రం జగన్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎవరూ జగన్ పక్క ఉండే పరిస్థితి లేదన్నారు. తనకు అనేక అవమానాలు జరిగాయన్నారు.