Vijayawada Flood Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా బాధితులకు పరిహారం చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు సీఎంఓను సైతం తప్పుదోవ పట్టించి పరిహారం చెల్లించేసినట్టు లెక్కలు చూపడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.