ఆడబిడ్డల రక్షణ కోసం అప్పట్లో దిశ యాప్‌ను తీసుకొచ్చామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు చేసి.. ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని చెప్పారు. గుంటూరులోని జీజీహెచ్ సహాన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… దిశ యాప్‌కు 19 నేషనల్ అవార్డులు వచ్చాయన్నారు. అంతటి గొప్ప దిశ యాప్ బిల్లుని బుద్ధి తక్కువతనంతో తగలబెట్టిన నారా లోకేశ్ ను పప్పు కాక మరేమిటి…? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.