ప్రముఖ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ, ‘గతంలో నేను తీసిన బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా సినిమాలు నాకు మంచి పేరుని తీసుకొచ్చాయి. కోవిడ్ టైం లో కూడా బట్టల రామస్వామి బయోపిక్‌ని ప్రజలు ఆదరించారు. అలాగే రిలీజ్‌కి రెడీగా ఉన్న, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలో బాయ్’ సినిమాలు మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాయి. క్రైం థ్రిల్లర్‌గా రానున్న ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాని ఆర్.పి.పట్నాయక్‌గారు డైరెక్ట్ చేసారు. జీరో టూ హీరో జోనర్‌లో ‘సోలో బాయ్’ సినిమా రెడీ అయింది. అంతే కాకుండా, కంటెంట్ ఉంటే సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నా గత సినిమాల మాదిరిగానే, డెఫినిట్‌గా ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్‌లో చేసాము. సోలో బాయ్ సినిమా ద్వారా నవీన్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్.
సోలో బాయ్ సినిమా గురించి మాట్లాడుతూ ‘సినిమా విడుదల ప్లాన్ చేస్తున్న సమయంలో మా హీరో గౌతమ్‌కృష్ణకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అతను రాగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము’ అన్నారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.