మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)కి విలాసవంతమైన, ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం.దాంతో మార్కెట్లోకి వచ్చే కొత్త రకం కార్లని కొనుగోలు చేస్తుంటాడు.ఆయన గ్యారేజీలో టాప్ ఎండ్ మోడల్ కార్లు చాలానే ఉన్నాయి.లేటెస్ట్ గా మార్కెట్‌లోకి వచ్చిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు.

ఈ మేరకు కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి విచ్చేశాడు.ఈ సందర్భంగా అధికారులు చరణ్ కి స్వాగతం పలికి  మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి టిజి 2727 నెంబర్ ని కేటాయించారు. అత్యాధునిక వసతులు, సౌకర్యాలు, కొత్త ఫీచర్స్‌తో ఉన్న రోల్స్ రాయిస్‌హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర సుమారుగా 7.5 కోట్ల రూపాయలు అని తెలుస్తుంది.ఎలక్ట్రికల్ ఫీచర్స్‌తో ఉండే ఫాంథామ్ కారును తొలిసారి మార్కెట్‌లోకి వచ్చింది. వీల్స్ సుమారుగా 23 ఇంచులు ఉండటం ఓ ప్రత్యేకత తో పాటు స్పెక్ట్రమ్ ఈవీ ఫీచర్ మరో అదనపు ఆకర్షణ అని కూడా తెలుస్తుంది.ఈ కారుని  ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారుగా 530 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.ఒక్కసారి స్టార్ట్ చేస్తే జీరో నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను సుమారుగా 4 సెకన్లలోనే అందుకొంటుంది అని కూడా తెలుస్తుంది.రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here