మ్యాగీలో రెండు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి మైదాతో చేసినదైతే, ఇంకొకటి గోధుమపిండితో చేసినది. అలాగే మిల్లెట్లతో చేసిన మ్యాగీ కూడా లభిస్తుంది. వీలైనంతవరకు మైదాతో చేసిన మ్యాగీని దూరంగా ఉంచడమే మంచిది. మార్కెట్లో గోధుమలతో చేసిన మ్యాగీ లభిస్తుంది. దాన్ని తీసుకొని ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్లెట్లతో చేసే మ్యాగీ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని తరగతుల వారు కొనలేకపోవచ్చు, కానీ గోధుమ పిండితో చేసే వెజ్ నూడిల్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వీటితో ఏ నూడిల్స్ చేసుకున్న టేస్టీ గానే ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.